TTD9th Nov 11:43 AMSunil Byrisetty1 min read

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

వారాంతాల్లో తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరక

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు
వారాంతాల్లో తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలో భక్తులు ఉన్నారు. నిన్న వేంకటేశ్వరుడిని 80,560 మంది దర్శించుకున్నారు. 31,195 మంది తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు లభించింది. కాగా ఇవాళ సుప్రభాత సేవలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీకి అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది.
Andhra Pradesh News
Tirumala
TTD
Tirupati
Lord Venkateswara
Devotees Rush
Mukesh Ambani
భక్తుల రద్దీ
ముకేశ్ అంబానీ
హుండీ ఆదాయం
సుప్రభాత సేవ
Scroll for the next article