Spiritual9th Aug 04:12 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇచ్చిన ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్య నిర్వహణ అధికారి శీన న

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇచ్చిన ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ కార్య నిర్వహణ అధికారి శీన నాయక్ దగ్గరుండి ప్రత్యేక ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తున్నారు. క్యూలైన్లో భక్తులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ, సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. సామాన్య భక్తులకి తొలి ప్రాధాన్యత ఇచ్చి వీఐపీ భక్తుల దర్శనాలు నిలిపివేశారు. ఘాట్ రోడ్డు మహా మండపం అమ్మవారి ఆలయ ప్రాంగణం అన్ని ప్రాంతాలలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టి పర్యవేక్షణ చేస్తూ ఆలయ అధికారులు, పాలకమండలి విజయవాడ నగర పోలీస్ అధికారులు సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక సేవలు అందిస్తున్నారు
Andhra Pradesh
Indrakeeladri
Vijayawada
Kanaka Durga Temple
Devotees
Temple Rush
Darshan
VIP Darshan
Borra Radhakrishna
శీన నాయక్
ఆలయ ఏర్పాట్లు
విజయవాడ వార్తలు
ఆంధ్రప్రదేశ్
భక్తి వార్తలు
Scroll for the next article