Telangana3rd Nov 05:03 PMSunil Byrisetty1 min read

తెలంగాణకూ జోరు వానలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ఏపీలోనే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతా

తెలంగాణకూ జోరు వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ఏపీలోనే కాదు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రంగారెడ్డి సహా మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాగల 24 గంటల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Scroll for the next article