News11th Jan 04:22 PMSunil Byrisetty1 min read
నిమిషానికి 47 వాహనాలు.. రోడ్లు కిటకిట!
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మూడో రోజు వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. వాహనాల రద్దీ
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మూడో రోజు వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. వాహనాల రద్దీ పెరగడంతో పంతంగి టోల్ ప్లాజా లోని మొత్తం 16 టోల్ బూతులకు గాను 11 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచారు.
నిమిషానికి 47 వాహనాల చొప్పున టోల్ ప్లాజా నుండి వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పటివరకు 1,30.000 వేల వాహనాలు వెళ్ళినట్టు సమాచారం. ఈరోజు ఆదివారం కావడంతో పాటు వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సొంతూర్లకు వెళ్తుండడంతో ఈరోజు వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం వుంది. వాహనాల రద్దీ నియంత్రించేందుకు పోలీసులతోపాటు టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.