News13th Oct 04:22 PMSunil Byrisetty1 min read

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్!

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ హెలీ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్!
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ హెలీ టూరిజానికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది విజయవంతం అయితే ఉమ్మడి వరంగల్ లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ తీసుకురానుంది. దీని ద్వారా పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు అడుగులు వేస్తోంది.
Hyderabad to Srisailam
Helicopter Service
Telangana Tourism
Heli Tourism
Nallamala Forest
Srisailam Temple
Sankranti Launch
రామప్ప
లక్నవరం
పర్యాటక అభివృద్ధి
Scroll for the next article