Telangana22nd Jan 04:10 PMSunil Byrisetty1 min read

మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు!

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 28, 29, 30, 31, తేదీల్లో మహా జాతర జరగనుండగా.. భక్తులకు సౌకర్యార్థం హన్మకొండ, నుంచి మేడారం వరకు పది రోజులపాటు.. హెలికాప్టర్ సేవ

మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు!
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల 28, 29, 30, 31, తేదీల్లో మహా జాతర జరగనుండగా.. భక్తులకు సౌకర్యార్థం హన్మకొండ, నుంచి మేడారం వరకు పది రోజులపాటు.. హెలికాప్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయని టూరిజం శాఖకు చెందిన అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ మేడారంలో భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హనుమకొండ నుంచి మేడారం వచ్చే భక్తులకు ఒక్కొక్కరికి 35 వేల 999 రూపాయలు వసూలు చేస్తారు. ఇందుకోసం మేడారంలోని పడి గాపూర్, దగ్గర హెలిప్యాడ్, ఏర్పాటు చేశారు.మేడారం ఏరియల్ "వ్యూ" వీక్షించేందుకు హెలికాప్టర్ సేవలు అందు బాటులో ఉంటాయని టూరిజం శాఖ తెలిపింది. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభిస్తారు.
Telangana
Medaram Jatara
Telangana Kumbh Mela
Helicopter Services
Telangana Tourism
Hanumakonda to Medaram
భక్తుల సౌకర్యాలు
సమ్మక్క సారలమ్మ జాతర
పండుగ
Scroll for the next article