News2nd Nov 04:49 PMSunil Byrisetty1 min read
హేమంత్ ఆరోగ్యం బాగుంది
నిందితుడు హేమంత్ ఆరోగ్యంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ వివరాలు వెల్లడించాురు. పోలీసు కాల్పుల్లో గాయపడిన హేమంత్ ఆరోగ్యం బాగుందని తెలిపారు. నిందితుడి కాళ్లకు తీసిన ఎక్స్‌రేలో బుల్లెట్లు
నిందితుడు హేమంత్ ఆరోగ్యంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ వివరాలు వెల్లడించాురు. పోలీసు కాల్పుల్లో గాయపడిన హేమంత్ ఆరోగ్యం బాగుందని తెలిపారు. నిందితుడి కాళ్లకు తీసిన ఎక్స్‌రేలో బుల్లెట్లు కనపడలేదని, నిందితుడి కుడి కాలుకు తీవ్రగాయమైంది.. రక్త ప్రసరణ లేదని వెల్లడించారు. హేమంత్ కుడికాలు రక్త ప్రసరణలేక కుళ్లింది.. సగం కాలు తొలగించే పరిస్థితి రావచ్చని చెప్పారు. నిందితుడి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు అనస్తీషియా వైద్యుడు పరిశీలిస్తున్నారన్నారు. ఎక్స్ రే రిపోర్టు, అనస్తీషియా వైద్యుడి నివేదిక పరిశీలించాక కాలు తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.