Politics8th Nov 03:53 PMSunil Byrisetty1 min read
పంచాయతీ ఎన్నికల్లో గుర్తులివే!
ఏపీలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా సర్పంచి అభ్యర్థుల కోసం
ఏపీలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 26, 29, డిసెంబరు 2వ తేదీల్లో పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా సర్పంచి అభ్యర్థుల కోసం 25, వార్డు సభ్యుల కోసం 20 చొప్పున గుర్తులు కేటాయించారు. వీటికి అదనంగా నోటా ఉండనుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే కొత్త గుర్తులు కేటాయించనున్నారు.
సర్పంచి అభ్యర్థులకు.. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పూ సాసరు, క్యారెట్, తాళంచెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా గుర్తులు కేటాయించనున్నారు. వార్డు సభ్యులకు.. ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్, బీరువా, ఐస్ క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులు ఇవ్వనున్నారు.