Celebrities15th Mar 03:57 PMSunil Byrisetty1 min read
ఆ రోజున సాయం చేస్తానన్న కన్నప్ప!
భక్తకన్నప్ప జన్మస్థలమైన రాజంపేట (మం) ఊటుకూరు గ్రామంలో సినీ నటుడు మంచు విష్ణు సందడి చేశారు. ఊటుకూరు శివాలయాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలను మంచు విష్ణు, కన్నప్ప సినీ బృందం దర్శించుక
భక్తకన్నప్ప జన్మస్థలమైన రాజంపేట (మం) ఊటుకూరు గ్రామంలో సినీ నటుడు మంచు విష్ణు సందడి చేశారు.
ఊటుకూరు శివాలయాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలను మంచు విష్ణు, కన్నప్ప సినీ బృందం దర్శించుకున్నారు.
ఆలయ మర్యాదలతో ఊటుకూరు శివాలయం కమిటీ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
కన్నప్ప యూనిట్‌ను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప చిత్రాన్ని తీస్తున్నానని చెప్పారు.
ఆ కన్నప్ప ఆశీస్సులు తనకు, తన చిత్రానికి ఉండాలని ఆలయాన్ని దర్శించుకున్నానని తెలిపారు.
ఏప్రిల్ 25న కన్నప్ప చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నానన్నారు.
చిత్రం విడుదలైన తర్వాత ఆలయ అభివృద్ధి సహాయం చేస్తానని విష్ణు చెప్పారు.