News9th May 11:16 AMSunil Byrisetty1 min read

సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్..

పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో అలర్ట్ విధించారు. ఢిల్లీ హర్యానా బెంగాల్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప

సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్..
పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. జమ్ముకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో అలర్ట్ విధించారు. ఢిల్లీ హర్యానా బెంగాల్‌లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనాధికారుల సెలవులు రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలనూ మూసివేశారు. గుజరాత్‌ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హమీపుర్‌, ఉనా బిలాస్‌పుర్‌లో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు.
Airports Closed
High Alert in Border States 21
Pakistan Border
Operation sindoor
పాకిస్తాన్‌తో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో హైఅలర్ట్
జమ్ముకశ్మీర్
రాజస్థాన్
పంజాబ్
గుజరాత్‌
Scroll for the next article