News24th Apr 05:18 PMSunil Byrisetty1 min read
హైదరాబాద్, తిరుమలలో హై అలెర్ట్
దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో హెచ్‌ఐసీసీ కేంద్రంగా జరగనున్న భారత్
దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో హెచ్‌ఐసీసీ కేంద్రంగా జరగనున్న భారత్ సమిట్-2025, మే 7 నుంచి 31 వరకు జరగనున్న మిస్ వరల్డ్-2025 సహా పలు జాతీయ స్థాయి కార్యక్రమాల నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేయనున్నారు. జమ్మూకాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం అలర్ట్ అయింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లలోను, పలుచోట్ల ఆర్టీసీ బస్సులను, ఇతర ప్రైవేటు వాహనాలను, లగేజీని క్షుణ్ణంగా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ పరిసరాల్లోనూ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. అనుమానితులను సెక్యూరిటీ సిబ్బంది విచారిస్తూ, వారి వివరాలను సేకరిస్తున్నారు.