News27th May 09:42 AMSunil Byrisetty1 min read

కేరళలో హై అలర్ట్.. కొట్టుకొచ్చిన కంటెయినర్!

కేరళ తీరప్రాంతంలోని కొచ్చి వద్ద మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారులు ఆ ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళల

కేరళలో హై అలర్ట్.. కొట్టుకొచ్చిన కంటెయినర్!
కేరళ తీరప్రాంతంలోని కొచ్చి వద్ద మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారులు ఆ ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళలోని కొచ్చి తీరానికి 38 నాటికల్‌ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైంది. సముద్రంలో మునిగిపోయిన లైబీరియా భారీ నౌకలోని కంటెయినర్లు ఒక్కొక్కటిగా కేరళ తీరప్రాంతానికి కొట్టుకొస్తున్నాయి. కొన్ని కంటెయినర్లు దక్షిణ కొల్లాం, అలప్పుజ తీర ప్రాంతానికి కొట్టుకు వచ్చాయని అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కంటెయినర్లు లేదా వాటి శిథిలాలకి ప్రజలు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు, కాలుష్య నివారణకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
High Alert In Kochi
Cargo ship accident off
Kerala Coast
Containers From Capsized Ship
Hazardous Chemicals
నౌకలో ప్రమాదకర రసాయనాలు
ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌
ప్రాంతంలో హైఅలర్ట్‌
Scroll for the next article