News26th Sep 03:44 PMSunil Byrisetty1 min read

త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌

రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన రాయలసీమలో హైకోర్టు బెంచ్ కల సాకారం కాబోతోంది. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు కానుంది. ప్రభుత్వం ఆదేశాలతో కర్నూలులో భవనాల పరిశీలన జరుగుతోంది

త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్‌
రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన రాయలసీమలో హైకోర్టు బెంచ్ కల సాకారం కాబోతోంది. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు కానుంది. ప్రభుత్వం ఆదేశాలతో కర్నూలులో భవనాల పరిశీలన జరుగుతోంది. రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ భవనాలను కలెక్టర్‌ డా. సిరి పరిశీలించారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో, హైవేకు పక్కనే ఉన్న భవనాలు ఉండటంతో బెంచ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే భవనాల యజమానితో కలెక్టర్‌, అధికారులు మాట్లాడారు. త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి.
Andhra Pradesh
Kurnool
High Court Bench
Rayalaseema
Government Update
Judiciary
Infrastructure
కర్నూలులో హైకోర్టు బెంచ్‌
Scroll for the next article