News11th Jan 11:38 AMSunil Byrisetty1 min read

కోడి పందేలకు హైకోర్టు చెక్!

సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి జూద నిరోధక చట్టం-1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోద

కోడి పందేలకు హైకోర్టు చెక్!
సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి జూద నిరోధక చట్టం-1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహించే సంప్రదాయ నేపథ్యంలో ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలంది. చట్టాల ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించింది. కింది స్థాయి అధికారులు చట్టాలను అమలు చేయకపోతే వారిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంది. తనిఖీలకు ఎస్ఐ స్థాయికి తగ్గని పోలీసు అధికారి, తహశీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసే ఎన్జీవో ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించాలంది. కమిటీ తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు సహకరించాలని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి తీర్పు చెప్పారు.
Andhra Pradesh
High Court Order
Cockfighting Ban
Sankranti Festival
Animal Cruelty Prevention Act 1960
AP Gaming Act 1974
ఎస్పీలు
గోదావరి జిల్లాలు
చట్టం–క్రమశిక్షణ
Scroll for the next article