News18th Aug 05:32 PMSunil Byrisetty1 min read

డిప్యూటీ సీఎంపై అధికార దుర్వినియోగం కేసు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని ఏపీ హైకోర్టుల

డిప్యూటీ సీఎంపై అధికార దుర్వినియోగం కేసు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని ఏపీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. మంత్రిగా రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉంటూ ప‌రిపాల‌నను గాలికొదిలేసి, సినిమాల‌పైనే శ్ర‌ద్ధ వ‌హిస్తూ, ఎక్కువ కాలం హైద‌రాబాద్‌లోనే గ‌డుపుతున్నార‌ని ఏకంగా రాష్ట్ర అత్యున్న‌త ధ‌ర్మాసనంలో మాజీ ఐఏఎస్ అధికారి విజ‌య్‌కుమార్‌ పిటిష‌న్ వేశారు. కాగా విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. మంత్రి పదవిలో కొనసాగుతూ సినిమాల్లో నటించడం చట్టబద్ధమేనా? అనే ప్రశ్నపై కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజర‌వుతార‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది తెలుపగా, ఇది పూర్తిగా ఏసీబీ పరిధిలోకి వచ్చే విషయం కాబట్టి, ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ స్పందించాలని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు స్పష్టం చేశారు. కేసును వారం రోజులకు లేదా వచ్చే వారం లిస్టింగ్‌లో మరోసారి విచారణకు తీసుకురానున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
Andhra Pradesh
Pawan Kalyan
Jana Sena
AP Deputy CM
High Court Notices
Misuse of Power
Vijay Kumar Petition
విజయ్‌కుమార్ పిటిషన్
హైకోర్టు నోటీసులు
Scroll for the next article