Politics9th Oct 12:35 PMSunil Byrisetty1 min read
పీపీపీ విధానంలో తప్పేంటన్న హైకోర్టు
పీపీపీ విధానంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ జరుగుతున్న వేళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్మిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది.
పీపీపీ విధానంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ జరుగుతున్న వేళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్మిస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. 'నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకొని ఉండవచ్చు. అది తప్పెలా అవుతుంది. నిధులున్నప్పుడే కట్టాలంటే ఎన్నేళ్లు పడుతుంది. జిల్లాల్లో కోర్టు భవనాలు కూడా నిధుల లేమితో నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీపీపీతో ముందుకు రావడం సమంజసమే' అని పేర్కొంది. దీంతో పీపీపీపై రాజకీయం చేయాలనుకున్న వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.