Politics6th Jan 03:35 PMSunil Byrisetty1 min read

పరకామణి కేసులో పోలీసులపై క్రిమినల్ కేసులు

టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగంగా

పరకామణి కేసులో పోలీసులపై క్రిమినల్ కేసులు
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ, ఏసీబీ సంస్థలను ఆదేశించింది. ఈ కేసు విచారణ సందర్భంగా నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని అభిప్రాయపడింది. చోరీ ఘటన మినహా, దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై సీఐడీ, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ లక్ష్మీ రెడ్డిలను ఇప్పటికే వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాలతో వీరిపై సీఐడీ క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
Andhra Pradesh High Court
TTD Parakamani Case
Criminal Cases Against Police
CID Investigation
ACB Probe
Police Misconduct
తిరుమల తిరుపతి దేవస్థానాలు
న్యాయవ్యవస్థ
శాఖాపరమైన చర్యలు
Scroll for the next article