Politics4th Sep 04:40 PMSunil Byrisetty1 min read

14న కరేడుకు రామచంద్రయాదవ్

బిసివై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పోలీసులు ఆంక్షలు విధించినా.. కరేడు రైతులకు అండగా ఉంటానని గతంలో గ్రామస్తులకు మాట

14న కరేడుకు రామచంద్రయాదవ్
బిసివై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పోలీసులు ఆంక్షలు విధించినా.. కరేడు రైతులకు అండగా ఉంటానని గతంలో గ్రామస్తులకు మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల కరేడుకు వెళుతూ ఉండగా ఆయన్ని పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరేడు రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు కరేడుకు వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని ఆయన తరుపు న్యాయవాది కోర్టు ద్రుష్టికి తీసుకువచ్చారు. దీంతో హైకోర్టు రామచంద్రయాదవ్ కరేడుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 14న రామచంద్రయాదవ్ కరేడులో పర్యటించేందుకు అనుమతి ఇఛ్చిన హైకోర్టు.. దానికి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. వై ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామచంద్రయాదవ్ పర్యటనకు సహకరించాలని పోలీసులకు సూచించింది. దీంతో రామచంద్రయాదవ్ కరేడు పర్యటనకు మార్గం సుగమం అయింది.
Andhra Pradesh politics
Ramachandra Yadav
BCY Party
Karedu farmers protest
High Court order
police restrictions
Y+ security
farmers support
కరేడు రైతుల ఉద్యమం
రైతులకు మద్దతు
కరేడు పర్యటన
Scroll for the next article