News4th Sep 01:57 PMSunil Byrisetty1 min read

ఎమ్మెల్యే ద‌గ్గుబాటిపై హైకోర్టు సీరియస్!

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై హైకోర్టు సీరియస్ అయింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింద

ఎమ్మెల్యే ద‌గ్గుబాటిపై హైకోర్టు సీరియస్!
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై హైకోర్టు సీరియస్ అయింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ వ్యాఖ్యానించింది. దగ్గుబాటిపై గతంలో హత్య కేసు నమోదయింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన చెబుతున్నప్పటికీ ఆధారాలు ఉన్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై స్టే కోరుతూ ఇప్పటికే 7 సార్లు ఆయ‌న‌ హైకోర్టును ఆశ్రయించగా, ఆరుసార్లు స్టే దక్కింది. ఇప్పుడు ఏడోసారి కూడా స్టే కోరగా.. హైకోర్టు ఎమ్మెల్యే అయినంత మాత్రాన కేసుల నుంచి బయట పడలేరని, హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అసలు రాజకీయాల్లోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించింది.
Andhra Pradesh Politics
TDP
Daggubati Venkateswara Prasad
MLA
High Court
Murder Case
Arrest
Legal Proceedings
అనంతపురం
రాజకీయ వివాదం
ఎమ్మెల్యే ద‌గ్గుబాటిపై హైకోర్టు సీరియస్
Scroll for the next article