News28th Apr 02:38 PMSunil Byrisetty1 min read
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్!
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. 59 షెడ్యూల్డ్ కాస్ట్ ఉపకులాలను 3 గ్రూప్‌లుగా విభజిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను జైభీమ్ రావ్ భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరసా
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది.
59 షెడ్యూల్డ్ కాస్ట్ ఉపకులాలను 3 గ్రూప్‌లుగా విభజిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌ను జైభీమ్ రావ్ భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ హైకోర్టులో సవాలు చేశారు.
ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు మార్గ నిర్దేశాలకు వ్యతిరేకంగా ఉందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కి శాస్త్రీయమైన డేటా తయారు చేయకుండా తప్పుల తడకగా ఆర్డినెన్స్ ఇచ్చారని పిటిషనర్ వాదించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంజన్ మిశ్రా కమిషన్ డేటాను శాస్త్రీయంగా పరిశీలించకుండా రిపోర్ట్ సమర్పించారని తెలిపారు.
పిటిషనర్ తరపున మాజీ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ఈ ఆర్డినెన్స్ వల్ల లక్షలాదిమంది భవిష్యత్తు అంధకారమవుతుందని వివరించారు.
కమిషన్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయకుండా, ప్రజల నుంచి వినతులు స్వీకరించకుండా ప్రభుత్వం ఆమోదించిందన్నారు.
రంజన్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బహిర్గతం చేశారా అంటూ ధర్మాసనం అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించింది? సుప్రీంకోర్టు ఉప కులాలకు సంబంధించిన డేటా సేకరించడానికి ఏమైనా మార్గ నిర్దేశాలు నిర్దేశించిందా అంటూ అడిగింది.
అన్ని అంశాలను కౌంటర్లో వివరిస్తామని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సమయం కోరారు.
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని పేర్కొంది.