News17th Jul 11:17 AMSunil Byrisetty1 min read

అమరావతిలో హైటెక్‌ సిటీ

ఒక హైటెక్ సిటీ హైదరాబాద్, ఇంకా చెప్పాలంటే తెలంగాణ స్వరూపాన్నే మార్చేసింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యాధునిక హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిం

అమరావతిలో హైటెక్‌ సిటీ
ఒక హైటెక్ సిటీ హైదరాబాద్, ఇంకా చెప్పాలంటే తెలంగాణ స్వరూపాన్నే మార్చేసింది. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో అత్యాధునిక హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని రింగ్‌రోడ్డు వెంబడి హైటెక్‌ సిటీని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. దానిలో కృత్రిమమేధ (ఏఐ), సెమీ కండక్టర్లతో పాటు ఇతర హైటెక్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లు అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ‘స్వర్ణాంధ్ర ప్రదేశ్‌-2047 లక్ష్యసాధన దిశగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి’ అన్న అంశంపై దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలతో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ ఈ మేరకు సిఫారసు చేసింది.
Andhra Pradesh news
Amaravati High tech city
Amaravati Ring Road
swarnandhra 2047
high tech industrial
chandra babu
అమరావతిలో హైటెక్‌ సిటీ
Scroll for the next article