Politics22nd May 01:25 PMSunil Byrisetty1 min read

దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ హరికృష్ణ(28)ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారంటూ వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు

దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ హరికృష్ణ(28)ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారంటూ వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించాయి. హరికృష్ణ తండ్రి ఉప్పుతోళ్ళ ఎల్లయ్య తంగెడ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడుగా ఉన్నారు. హరికృష్ణను పోలీసులు చిత్రహింసలు పెట్టి కాలు విరగొట్టారంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. అయితే పోలీసులు మాత్రం హరికృష్ణపై కేసు ఉన్న కారణంగానే పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చామని చెబుతున్నారు. కేసు వివరాలు తెలపాలంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో, పోలీసులకు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు
Andhra Pradesh
Palnadu
Dachepalli Police Station
High Tension
Hari Krishna
దాచేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
పోలీసులకు వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
Scroll for the next article