News5th Dec 03:16 PMSunil Byrisetty1 min read
శబరిమల యాత్రలో తెలుగు భక్తుడిపై దాడి.. ధర్నా
కేరళలోని శబరిమల యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలం
కేరళలోని శబరిమల యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప స్వాముల బృందం శబరిమల దర్శనానికి వెళ్తున్నది. ఈక్రమంలో మార్గమధ్యంలో పళనిలోని సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఓ భక్తుడు సమీప దుకాణంలో వాటర్ బాటిల్, కూల్‌డ్రింక్స్ కొనుగోలు చేయడానికి వెళ్లారు. అయితే ఎంఆర్‌పీ రూ.30గా ఉండగా.. దుకాణదారుడు రూ.40 డిమాండ్ చేశాడు. అదేంటని నిలదీయగా.. తమిళంలో తిట్టడం మొదలుపెట్టాడు. గాజు సీసాతో అయ్యప్ప భక్తుడిపై దాడి చేశాడు. దీంతో బాధితుడి తలకు తీవ్ర రక్తగాయమైంది.