Politics4th May 11:26 AMSunil Byrisetty1 min read

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల అరెస్ట్!

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల అరెస్టయ్యారు. వైయస్ జగన్ కోసం ఏర్పాటు చేసిన రామగిరి హెలిప్యాడ్ దగ్గర పోలీసులపై దాడి ఘటనలో అరెస్ట్ చేశారు. మొత్తం 11 మంది వ

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల అరెస్ట్!
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల అరెస్టయ్యారు. వైయస్ జగన్ కోసం ఏర్పాటు చేసిన రామగిరి హెలిప్యాడ్ దగ్గర పోలీసులపై దాడి ఘటనలో అరెస్ట్ చేశారు. మొత్తం 11 మంది వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరి కొందరు వైసీపీ నేతల కోసం గాలిస్తున్నారు. ఇంకా అజ్ఞాతంలోనే తోపుదుర్తి బ్రదర్స్ ఉన్నారని, వారు హైదరాబాద్లో ఉన్నట్లు సమాచారం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం హైదరాబాద్కు ఏపీ పోలీసులు వెళ్లారు. మరోవైపు తోపుదుర్తి అరెస్ట్‌పై ఏపీ డీజీపీ ఆఫీస్ సీరియస్ అయింది. అరెస్ట్‌లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై నివేదిక ఇవ్వాలని సత్యసాయి జిల్లా ఎస్పీకి ఆదేశించారు.
Andhra pradesh
Rapthadu
YSRCP
Thopudurthi Prakash Reddy
Police
అజ్ఞాతంలోనే తోపుదుర్తి బ్రదర్స్
సత్యసాయి జిల్లా ఎస్పీ
11 మంది వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Scroll for the next article