Politics14th Jun 12:32 PMSunil Byrisetty1 min read
తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున ఆయన అనుచురులు చేరుకున్నారు. టెన్షన్ వాతావరణం నెలకొనడంతో అడి
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున ఆయన అనుచురులు చేరుకున్నారు. టెన్షన్ వాతావరణం నెలకొనడంతో అడిషనల్ ఎస్పీ రోహిత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తారన్న సమాచారంతో పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తామంటూ జేసీ ప్రభాకరెడ్డి, ఆయన అనుచరులు అంటున్నారు. తాడిపత్రికి వచ్చేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాకూడా పోలీసులు నన్ను తాడిపత్రిలోనికి రానివ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తున్నారని ప్రచారం జరగడంతో టీడీపీ కార్యకర్తలు జేసీ ఇంటి వద్దకు చేరుకోవడంతో టెన్షన్ చోటు చేసుకుంది.