Politics12th Sep 02:07 PMSunil Byrisetty1 min read
తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయం
అనంతపురం జిల్లా తాడిపత్రి మళ్లీ వార్తలకెక్కింది. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు భూ ఆక్రమణ నోటీసులు జారీ చేయడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎల
అనంతపురం జిల్లా తాడిపత్రి మళ్లీ వార్తలకెక్కింది. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు భూ ఆక్రమణ నోటీసులు జారీ చేయడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రి పట్టణంలోని సర్వే నంబర్లు 639, 640, 641లో ఉన్న 10 సెంట్ల మున్సిపల్ స్థలం ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూడా ఉంది. ఈ ఉదయం అధికారులు పెద్దారెడ్డి ఇంటి వద్దకు చేరుకుని మరోసారి సర్వే చేపట్టి, కొలతలు వేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంటనే తాడిపత్రికి బయలుదేరారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటితో పాటు, ఆయన రాజకీయ ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.