News17th Apr 08:47 AMSunil Byrisetty1 min read
తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ Vs వైసీపీ
తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై భూమనకు టీడీపీ ఛాలెంజ్ విసిరింది. టీడీపీ నేతలు టీటీడీ గోశాలకు వచ్చి గోవులను చూడాలని సవాల్ విసిరారు. టీడీపీ రాష్ట్ర చీఫ
తిరుపతి నగరంలో ఉద్రిక్తత నెలకొంది.
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై భూమనకు టీడీపీ ఛాలెంజ్ విసిరింది.
టీడీపీ నేతలు టీటీడీ గోశాలకు వచ్చి గోవులను చూడాలని సవాల్ విసిరారు.
టీడీపీ రాష్ట్ర చీఫ్ పల్లా ఛాలెంజ్‌ను స్వీకరించిన భూమన ఉదయం 10 గంటలకు గోశాలకు వస్తానని చెప్పారు.
అయితే కార్యకర్తలతో కాకుండా గన్ మెన్ లతో గోశాలను సందర్శించి మీడియాతో మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
అయితే భూమనను హౌస్ అరెస్ట్ చేశారని, గోశాలకు రాకుండా అడ్డుకున్నారని ప్రచారం జరుగుతోంది.
దీనిపై తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందించారు.
టిటిడి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ని గృహనిర్బంధం చేయలేదన్నారు.
గోశాలకు వెళ్లడానికి భూమనకు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదని, రెండు పార్టీల నేతలు ఒకే సారి వెళ్లకూడదని సూచించామని చెప్పారు.