Politics9th Jul 01:54 PMSunil Byrisetty1 min read

జగన్ పర్యటనలో అడుగడుగునా ఉల్లంఘనలు

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు ముందే వైసీపీ కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారు. జగన్ రాకముందే మార్కెట్ యార్డు గేట్లను తోసుకుని లోపలికి వెళ్లారు. మామిడి రైతులతో

జగన్ పర్యటనలో అడుగడుగునా ఉల్లంఘనలు
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు ముందే వైసీపీ కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారు. జగన్ రాకముందే మార్కెట్ యార్డు గేట్లను తోసుకుని లోపలికి వెళ్లారు. మామిడి రైతులతో ముఖాముఖికి మార్కెట్ యార్డుకు జగన్ వెళ్లే పర్యటనకు గత ఘటనల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు విధించారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్‍‌కు 500 మందికి పోలీసులు అనుమతినిచ్చారు. అలాగే హెలీప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతిచ్చిన పోలీసులు.. ర్యాలీలు, బహిరంగసభలు పూర్తిగా నిషేధించారు. జనసమీకరణకు యత్నిస్తున్న 370 మంది వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Andhra Pradesh news
Ap politics
chittoor
ys jagan Bangarupalem tour
market yard
Mango Farmers
జగన్ పర్యటనలో ఉద్రిక్తత
Scroll for the next article