Agriculture12th Jun 01:31 PMSunil Byrisetty1 min read

సరికొత్త వంగడాల సృష్టికి కేంద్ర బిందువు అవ్వాలి

రైతులకు మేలు జరిగే విధంగా, అధిక దిగుబడులు ఇచ్చే సరికొత్త వంగడాలను సృష్టించాలని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స

సరికొత్త వంగడాల సృష్టికి కేంద్ర బిందువు అవ్వాలి
రైతులకు మేలు జరిగే విధంగా, అధిక దిగుబడులు ఇచ్చే సరికొత్త వంగడాలను సృష్టించాలని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. రైతులకు అధిక దిగుబడి వచ్చేలా, పెట్టుబడి తగ్గేలా విత్తనాలను తయారుచేయాలన్నారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ యూనివర్సిటీ నుంచి విద్యనభ్యసించటం, వారంతా గొప్ప స్థానాల్లో ఉండటం గర్వకారణమన్నారు. కాలానుగుణంగా పరిస్థితులో చాలా మార్పులు వచ్చాయని, అందుకు తగ్గట్టుగానే వ్యవసాయం చేసే విధానంలో కూడా మార్పులు చేయాలన్నారు. రైతులు పురుగుమందుల వాడకం తగ్గించాలని, సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన పెంచాలని అన్నారు. ఒకే విధమైన పంటను కాకుండా ఇతర పంటలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. భూసార పరీక్షలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
Andhra Pradesh news
NG Ranga Agricultural University
Minister Kinjarapu Atchannaidu
high yields
farmers
రైతులు పురుగుమందుల వాడకం తగ్గించాలని
భూసార పరీక్షలకు ప్రత్యేక చర్యలు
Scroll for the next article