Education8th Sep 05:22 PMSunil Byrisetty1 min read
‘కార్పొరేట్’ కంటే ఎంజేపీకే డిమాండ్
రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంతో కార్పొరేట్ విద్యా సంస్థలతో జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాల పోటాపడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యా
రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంతో కార్పొరేట్ విద్యా సంస్థలతో జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాల పోటాపడుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ స్కూళ్లకే డిమాండ్ ఎక్కువగా ఉందని వెల్లడించారు. బీసీ బిడ్డలకు ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు పెనుకొండలోని రొద్దం-2 ఎంజేపీ స్కూల్లో స్మార్ట్ పే ఫోన్లను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో కలిసి మంత్రి సవిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న 110 ఎంజేపీ స్కూళ్లో 700ల వరకూ స్మార్ట్ పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఫోన్ల ద్వారా తమ తల్లిదండ్రులతో విద్యార్థులు రోజూ మాట్లాడుకునే అవకాశం కల్పించామన్నారు.