Agriculture2nd Mar 11:07 AMNelluri Viswanath1 min read
మార్చి నుంచే మంట మొదలు
ఏపీలో మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం ఉండనుంది. మార్చి నుంచి మే వరకు శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని
ఏపీలో మార్చి నుంచే సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మరింత ప్రభావం ఉండనుంది. మార్చి నుంచి మే వరకు శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. గర్బిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. ఎండలపై సమాచారంకు విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101