News4th May 10:12 AMSunil Byrisetty1 min read

దేవాదాయ భూముల చట్టం సవరణ

దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయశాఖకు చెందిన వ్యవసాయ భూములు, స్థిరాస్తులు, లీజులు, లైసెన్స్ లు నియామకాలు–2003కు సవరణలు చేస్తూ ప్రభుత్వం జిఓ నెం

దేవాదాయ భూముల చట్టం సవరణ
దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయశాఖకు చెందిన వ్యవసాయ భూములు, స్థిరాస్తులు, లీజులు, లైసెన్స్ లు నియామకాలు–2003కు సవరణలు చేస్తూ ప్రభుత్వం జిఓ నెంబరు 139ని విడుదల చేసింది. 20 ఏళ్లు ఏ సంస్థ, సేవా ట్రస్టులు ఆయా ఆలయాలకు సేవలందిస్తున్నట్లు గుర్తిస్తే ఆయా సంస్ధలకు భూములు వేలం పాట ద్వారా కాకుండా ప్రభుత్వం నేరుగా లీజుకు ఇచ్చే అవకాశం ఈ సవరణ ద్వారా కలుగుతుంది. ఇప్పటి వరకు మూడేళ్ల పాటు దేవాదాయశాఖ తమ ఆస్తులను లీజుకు ఇచ్చే అవకాశం ఉండేది. ప్రభుత్వం ప్రస్తుతం తీసుకొచ్చిన సవరణ ద్వారా 20 ఏళ్ల సేవ పేరుతో ఆయా ఆస్తులను వేలం పాట ద్వారా కాకుండా, నేరుగా లీజుకు ఇవ్వనుంది.
Andhra pradesh
Amendment
Hindu Religious Properties
Agricultural Lands
దేవాదాయశాఖకు
జిఓ నెంబరు 139ని విడుదల
వ్యవసాయ భూములు
Scroll for the next article