News10th Aug 03:06 PMSunil Byrisetty1 min read
గుంటూరుపై పెమ్మసాని మార్క్!
చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు రూపురేఖలు మారుతున్నాయి. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రాత మారుస్తున్నారు దశాబ్దాలుగా మాటల్లోనే ఉండిపోయిన పనుల్ని చేతల్లోకి తెచ్చేందుకు ప్ర
చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు రూపురేఖలు మారుతున్నాయి.
గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రాత మారుస్తున్నారు దశాబ్దాలుగా మాటల్లోనే ఉండిపోయిన పనుల్ని చేతల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా శంకర్ విలాస్ రైల్వే వంతెన స్థానంలో కొత్తది.. విశాలమైనది కట్టాలని పాతికేళ్లుగా డిమాండ్ ఉంది. ఇప్పటికి పెమ్మసానితో అది సాకారం అవుతోంది. డిజైన్లు, టెండర్లు అన్నీ పూర్తయి పనులు ప్రారంభమయింది. వీలైనంత వేగంగా పూర్తి చేసి ప్రజల ట్రాఫిక్ కష్టాల్ని తీర్చాల్సి ఉంది. ఇక పొన్నూరు రోడ్ తో పాటు.. మిర్చియార్డ్ వద్ద కూడా ఫ్లైఓవర్లను మంజూరు చేయించారు. వాటి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని చేశారు. కానీ వాటిని వినియోగంలోకి తేవాల్సిన ఉంది. ఆ పని కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.