Telangana28th Jun 05:31 PMSunil Byrisetty1 min read

తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బ

తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 1: 45 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి. 2 నుంచి 2.30 వరకు జాతీయ పసుపు బోర్డ్ కార్యాలయంలోనే అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిజామాబాద్‌లోని కంటేశ్వర్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 2:45 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Telangana
Home minister amit Shah
Telangana Tour
nizambad
Turmeric board
Begumpet airport
తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన
Scroll for the next article