News26th Jan 11:45 AMSunil Byrisetty1 min read

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి

పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోం మంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గ

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి
పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోం మంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు, అధికారులకు మంత్రి అనిత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోం మంత్రి అనిత, ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా పాటుపడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను గుర్తుంచుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేసి వారితో స్నేహపూర్వకంగా మమేకమయ్యారు.
Andhra Pradesh
Republic Day
National Flag Hoisting
Home Minister Anita
Andhra Pradesh
Payakaraopeta Constituency
Nakkapalli
Constitution Values
ప్రజాస్వామ్యం
పోలీస్ గౌరవ వందనం
ప్రభుత్వ కార్యక్రమం
Scroll for the next article