News25th Oct 01:06 PMSunil Byrisetty1 min read
తుఫాన్ ఎఫెక్ట్.. హోంమంత్రి అలర్ట్!
బంగాళాఖాతంలోని వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికార యంత్రాంగం హైఅలెర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమ
బంగాళాఖాతంలోని వాయుగుండం అతి తీవ్ర తుపానుగా బలపడే నేపథ్యంలో హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
అధికార యంత్రాంగం హైఅలెర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తుపాను ప్రభావంతో సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం బాపట్ల – విశాఖ తీరాల మధ్య తీరం దాటే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని,
ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.