News12th Nov 04:07 PMSunil Byrisetty1 min read
మాదకద్రవ్యాలు వద్దంటూ 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన హోం మంత్రి
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు. పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 30 రోజుల పాటు, సుమారు 800 కిలోమీటర్లకు పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో విద్యార్థులతో ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంతగానో అలరించింది. ‘మాదకద్రవ్యాలు వద్దు - జీవితమే ముద్దు’ అంటూ ఫ్లాష్‌మాబ్‌లో విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థులతో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు హోం మంత్రి అనిత. అనంతరం మంత్రి స్వయంగా గౌతమ్ థియేటర్ నుండి సైకిల్ తొక్కి ర్యాలీలో పాల్గొని శ్రీప్రకాశ్ కాలేజ్ వరకు నడిపారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ గంజాయిపై ఉక్కుపాదం మోపామని వ్యాఖ్యానించారు. గంజాయి మత్తులో యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. మన భవిష్యత్ - మన చేతుల్లోనే ఉందన్నారు.