News9th Aug 02:59 PMSunil Byrisetty1 min read

జైల్లో ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి!

రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి హోం మంత్రి అనిత వెళ్లారు. అక్కడ శిక్ష అనుభవిస్తున్న యువ ఖైదీలకు రాఖీలు కట్టి పరివర్తన కావాలని కోరారు. దాదాపు 30 మంది ఖైదీలకు రాఖీ క

జైల్లో ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి!
రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి హోం మంత్రి అనిత వెళ్లారు. అక్కడ శిక్ష అనుభవిస్తున్న యువ ఖైదీలకు రాఖీలు కట్టి పరివర్తన కావాలని కోరారు. దాదాపు 30 మంది ఖైదీలకు రాఖీ కట్టిన మంత్రి గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించారు.న హోం మంత్రి. యువత మంచి,చెడులను తెలుసుకోవాలని, తెలిసి తెలియని వయస్సులో ఈజీమనీ కోసం ఆలోచిస్తే, జీవితాలు నాశనం అయిపోతాయని హితవు పలికారు. బంగారు భవిష్యత్తులను నాశనం చేసుకోకండని సూచించారు. ఖైదీల జీవితాల్లో మార్పు రావాలని, బ్రతకడానికి చాలా అవకాశాలు ఉన్నాయని వివరించారు. వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇంటి దగ్గర రాఖీపౌర్ణమి జరుపుకోవాలని హోం మంత్రి అనిత ఆకాంక్షించారు.
Home Minister Anita
Visakhapatnam Central Jail
Rakhi Purnima
prisoner reform
youth awareness
anti-drug message
cannabis smuggling
life choices
crime prevention
జైల్లో ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి
Scroll for the next article