Politics27th Dec 04:51 PMSunil Byrisetty1 min read

జగన్‌పై హోంమంత్రి అనిత సీరియస్‌!

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై హోంమంత్రి అనిత సీరియస్‌ అయ్యారు. రాజకీయ ముసుగులో జగన్‌ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు బలిలో పాల్గొన్నవారు ఇప్పుడు రిమాండ్‌

జగన్‌పై హోంమంత్రి అనిత సీరియస్‌!
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై హోంమంత్రి అనిత సీరియస్‌ అయ్యారు. రాజకీయ ముసుగులో జగన్‌ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు బలిలో పాల్గొన్నవారు ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారన్నారు. ఫ్యాక్షన్‌ సినిమా చూసినట్లుగా వైసీపీ వికృత చేష్టలు ఉన్నాయన్నారు. జగన్‌ ఆదేశాలతోనే ఈ తరహా కార్యక్రమాలు జరిగాయా?.. గర్భిణిని కాలుతో తన్నే ఉన్మాదులను ఏమనాలని ప్రశ్నించారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం అడ్డం పెట్టుకునే కుట్ర అని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు యువత భవిష్యత్తుపై ఆలోచన చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు.
Andhra Pradesh
YS Jagan
Home Minister Anitha
YSRCP
political controversy
youth future
law and order
యువత భవిష్యత్తు
చట్ట-క్రమం
రాజకీయ హింస
Scroll for the next article