Politics11th Mar 01:16 PMSunil Byrisetty1 min read
జగన్ బాధ్యతగా సహకరించారా? అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత
వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్నిప్రమాదం ఘటనపై శాసనమండలిలో హోంమంత్రి అనిత స్పందించారు.. భద్రత లోపమనే ముందు బాధ్యతగా సహకరించడం కూడా అవసరమన్నారు. ఏ ప్రమాదం, నేరం జరిగినా పరిసర ప్రాంతాల ప్ర
వైఎస్ జగన్ ఇంటి దగ్గర అగ్నిప్రమాదం ఘటనపై శాసనమండలిలో హోంమంత్రి అనిత స్పందించారు..
భద్రత లోపమనే ముందు బాధ్యతగా సహకరించడం కూడా అవసరమన్నారు.
ఏ ప్రమాదం, నేరం జరిగినా పరిసర ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం, సీసీ టీవీ కెమెరా ఫుటేజ్ విచారణలో కీలకమని తెలిపారు.
నేరం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాల దృశ్యాలు రికార్డై ఉంటే వాటిని పోలీసులకు అందజేసి సహకరించడం బాధ్యత అని స్పష్టం చేశారు.
కాపాడమని పోలీసులను కోరతారు..కానీ, విచారణకు మాత్రం సహకరించరని విమర్శించారు.
సీన్ ఆఫ్ అఫెన్స్ లో సీసీ కెమెరా దృశ్యాలనే పోలీసులు ముందు పరిశీలిస్తారని వివరించారు.
ఛార్జ్ షీట్ వేయాలన్నా సీసీ టీవీ కెమెరాలు, వాటి దృశ్యాలదే కీలక పాత్ర అని చెప్పారు.
విచారణ కోసం సీసీ టీవీ ఫుటేజ్ ఎవరిని అడిగినా పోలీసులకు ఇవ్వడం రూల్ అని అనిత స్పష్టం చేశారు.