Spiritual10th Dec 11:52 AMSunil Byrisetty1 min read
భవాని దీక్షల విరమణ ఏర్పాట్లు తనిఖీ చేసిన హోం మంత్రి అనిత
భవాని దీక్షల విరమణలు విజయవాడ దుర్గ గుడిలో గురువారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై హోం మంత్రి వంగలపూడి అనిత జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. తనిఖీ అనం
భవాని దీక్షల విరమణలు విజయవాడ దుర్గ గుడిలో గురువారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై హోం మంత్రి వంగలపూడి అనిత జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ, భవానీ భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు చేసిన ఏర్పాట్లపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు నిర్ధారించారు. మంత్రి ఆకస్మిక తనిఖీల సందర్భంగా వారితోపాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నగర పోలీసు ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులు దుర్గగుడి ఈవో శీనా నాయక్, చైర్మన్ బోర్రా గాంధీ, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని హోం మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాలను ఈవో శీనా నాయక్ అందజేశారు.