News12th Sep 02:55 PMSunil Byrisetty1 min read

గణేష్‌ ఉత్సవాలపై ‘హోంమంత్రి అనిత’ ఆదేశాలు!

గణేష్‌ ఉత్సవాలపై ‘హోంమంత్రి అనిత’ కీలక ఆదేశాలుక జారీ చేశారు. ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, అనుమతుల జారీపై ఎస్

గణేష్‌ ఉత్సవాలపై ‘హోంమంత్రి అనిత’ ఆదేశాలు!
గణేష్‌ ఉత్సవాలపై ‘హోంమంత్రి అనిత’ కీలక ఆదేశాలుక జారీ చేశారు. ఏపీలోని అన్ని జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, అనుమతుల జారీపై ఎస్పీలతో సుదీర్ఘంగా చర్చించారు. గణేష్ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న 'సింగిల్‌ విండో విధానం'పై ఉత్సవ కమిటీలకు అవగాహన కల్పించాలని కోరారు. గణేష్‌ మండపాలు, ఊరేగింపుల నిబంధనలపై ఉత్సవ కమిటీలు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన చేశారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా bఎస్పీలకు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
Andhra Pradesh Police
Ganesh Chaturthi
Ganesh Celebrations
Home Minister Anitha
Vangalapudi Anitha
Ganesh Pandals
Ganesh Processions
ఉత్సవాల అనుమతులు
శాంతిభద్రతలు
జిల్లా ఎస్పీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
గణేష్ ఉత్సవం
ఏపీ వార్తలు
Scroll for the next article