News22nd Jan 04:05 PMSunil Byrisetty1 min read

అమరావతి సచివాలయంలో హోం శాఖ బడ్జెట్‌పై సమీక్ష

అమరావతి సచివాలయంలో హోం శాఖ వార్షిక బడ్జెట్‌పై హోం మంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసు వ్యవస్థను

అమరావతి సచివాలయంలో హోం శాఖ బడ్జెట్‌పై సమీక్ష
అమరావతి సచివాలయంలో హోం శాఖ వార్షిక బడ్జెట్‌పై హోం మంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసు వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల రాకను వేగవంతం చేయాలని, నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖలో టెక్నికల్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు APSP, ఇతర విభాగాల అవసరాలపై కూడా చర్చించారు. పోలీస్ సిబ్బంది పనితీరును మెరుగుపరచేందుకు అవసరమైన వనరులు, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.
Andhra Pradesh
Amaravati Secretariat
Home Department
Home Minister Vangalapudi Anitha
Police Department
బడ్జెట్ సమీక్ష
శాంతిభద్రతలు
పోలీస్ ఆధునీకరణ
Scroll for the next article