News4th Aug 06:43 PMSunil Byrisetty1 min read

జైళ్లశాఖపై హోం మంత్రి అనిత సమీక్ష

ఖైదీల సంక్షేమం, జైళ్ల ఆధునీకరణపై సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల, మౌలిక వసత

జైళ్లశాఖపై హోం మంత్రి అనిత సమీక్ష
ఖైదీల సంక్షేమం, జైళ్ల ఆధునీకరణపై సచివాలయంలో హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల, మౌలిక వసతుల కల్పన, పోస్టుల భర్తీ తదితర అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. హోం మంత్రి అనిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే జైళ్లశాఖలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 122 జైళ్లకు అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. జైళ్లశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెలతామన్నారు. కడప సెంట్రల్ జైల్లో ఫ్యాక్టరీ బ్యారక్, విజయనగరం బోర్స్టల్ స్కూల్లో లివింగ్ బ్యారక్, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఒక్కో బ్లాక్‌లో 120 ఖైదీల సామర్థ్యం గల రెండు కొత్త బ్లాక్‌లు, నెల్లూరు C.P. పరిధిలో వార్డర్లకు 36 క్వార్టర్లు నిర్మిస్తున్నామని వివరించారు. ఇంకా, రూ.1.16 కోట్లతో అనంతపురం అగ్రికల్చర్ కాలనీలో డిప్యూటీ జైలర్ల భవనాల నిర్మాణం, కడప సెంట్రల్ జైల్లో ఎలక్ట్రికల్ పనులు చేపట్టినట్లు తెలిపారు.
AndhraPradesh
PrisonReforms
InmateWelfare
VangalapudiAnitha
APHomeMinister
JailModernization
PrisonInfrastructure
CCcameras
జైళ్లశాఖపై హోం మంత్రి అనిత సమీక్ష
Scroll for the next article