News15th May 03:14 PMSunil Byrisetty1 min read

కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి అనిత

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. జగన్మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కు

కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి అనిత
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. జగన్మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుటుంబ సభ్యులతో కలిసి పట్టుచీర సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం హోంమంత్రి అనితకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ నూతన ఈవో శీనా నాయక్ అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు. ఆలయం క్యూలైన్లలో భక్తులను ఆత్మీయంగా పలకరించి అమ్మ సన్నిధిలో వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం హెంమంత్రి అనిత వెలగపూడి సచివాలయానికి వెళ్లారు. అక్కడ ప్రజలను కలిసి వారి గ్రీవెన్స్ స్వీకరించారు. అనంతరం 2వ బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హెంశాఖ కార్యాలయాన్ని హోంమంత్రి అనిత ఆకస్మికంగా పరిశీలించారు. ఫైళ్లు, రికార్డులను గురించి అడిగి తెలుసుకున్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తో కలిసి అన్ని ఛాంబర్లలోని సిబ్బందిని పలకరిస్తూ వారితో మాట్లాడారు. హోంశాఖకు వచ్చే గ్రీవెన్స్ త్వరితగతిన పూర్తి చేయడానికి ఆదేశాలు ఇచ్చారు.
Andhra Pradesh
VANGALAPUDI ANITHA
Vijayawada Durga Temple
ఆలయ నూతన ఈవో శీనా నాయక్ అమ్మవారి శేష వస్త్రం
Scroll for the next article