News6th Apr 11:24 AMSunil Byrisetty1 min read

తిరుమల శ్రీవారి సేవలో హోంమంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. విజన్‌- 2047, పీ-4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం

తిరుమల శ్రీవారి సేవలో హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. విజన్‌- 2047, పీ-4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకురావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా ఆమె దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని హోంమంత్రి దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రార్థించినట్లు అనిత తెలిపారు. శ్రీరామనవమి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో భాగ్యమని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు శనివారం రాత్రి తిరుమలలోరి భూవరాహ స్వామి ఆలయాన్ని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు.
Home Minister Anitha
Tirumala
Andhra Pradesh
తిరుమల తిరుపతి దేవస్థానం
హోంమంత్రి వంగలపూడి అనిత
శ్రీరామనవమి
Scroll for the next article