News30th Sep 02:16 PMSunil Byrisetty1 min read
మైనర్లకు హోంమంత్రి క్లాస్
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్ తీసుకున్నారు. విజయనగరం జిల్లా చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అని
ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్ తీసుకున్నారు. విజయనగరం జిల్లా చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అనిత గమనించారు. తన కాన్వాయ్‌ను అక్కడే ఆపించి, మైనర్లను మందలించారు. వాహనాలను చట్ట విరుద్ధంగా మైనర్లకు ఇవ్వడం నేరమని గుర్తు చేసిన హోంమంత్రి, ఈ ఘటనను తల్లిదండ్రులకు తెలియజేయాలంటూ పోలీసులు ఆదేశించారు వాహనాలను నడిపే వయస్సు రాకముందే పిల్లలకు స్కూటీలు, బైకులు ఇవ్వడం వల్ల వారు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారన్నారు. ఇది కేవలం రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆమె సూచించారు.