News29th Jan 04:51 PMSunil Byrisetty1 min read
అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లు పరిశీలన
అనకాపల్లి జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఉత్సవాలను జిల్లా సంస్కృతి, వైభవం చాటేలా నిర్వహించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని హోం మంత్రి వంగలపూడి
అనకాపల్లి జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఉత్సవాలను జిల్లా సంస్కృతి, వైభవం చాటేలా నిర్వహించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 30,31 తేదిలలో నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవాలలో భాగంగా ప్రధాన వేదిక, ఎన్.టి.ఆర్. స్టేడియంలో ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ లతో కలిసి ఆమె పరిశీలించారు. అనకాపల్లి ఉత్సవ్ థీమ్ సాంగ్ ను, ఉత్సవ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. వేదిక, సీటింగు ఏర్పాట్లు, ప్రవేశ ద్వారాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసారు. సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జన రద్దీని సక్రమంగా నియంత్రించాలని, స్టేడియం బయట కూడా స్క్రీన్లు ఏర్పాటుచేసి ప్రత్యక్ష ప్రచారం చేయాలని సూచించారు.