News8th Dec 02:31 PMSunil Byrisetty1 min read

తిరుపతి యూనివర్సిటీ లైంగిక దాడి కేసుపై హోంమంత్రి సీరియస్

తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో జరిగిన లైంగిక వేధింపులు & దాడి కేసుపై తక్షణమే హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సోమవారం ఈ ఘటనపై సమాచారం అందగానే హోంమంత్రి తిరుపతి ఎస్ప

తిరుపతి యూనివర్సిటీ లైంగిక దాడి కేసుపై హోంమంత్రి సీరియస్
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో జరిగిన లైంగిక వేధింపులు & దాడి కేసుపై తక్షణమే హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సోమవారం ఈ ఘటనపై సమాచారం అందగానే హోంమంత్రి తిరుపతి ఎస్పీ శ్రీనివాసులు, చిత్తూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు ఆరా తీశారు. పోలీసులు వెంటనే బాధిత విద్యార్థిని ఆదుకుని ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ కోసం ఒడిశా రాష్ట్రానికి ప్రత్యేక పోలీసు బృందం బయలుదేరింది. నిందితులు ఒడిశాకు చెందిన వారని, వారిని అరెస్టు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. “బాధిత విద్యార్థినికి న్యాయం జరుగుతుంది. ఎవ్వరినీ ఉపేక్షించేది లేదు. మహిళలు, విద్యార్థినుల రక్షణే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
Andhra Pradesh
Tirupati
University Case
Sexual Assault
Home Minister Anitha
AP Police
Student Safety
Justice for Victim
Chittoor
విద్యార్థినుల రక్షణ
బాధితురాలికి న్యాయం
Scroll for the next article