News15th Dec 03:00 PMSunil Byrisetty1 min read
గంగానమ్మ జాతరకు హోం మంత్రి అనిత
ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న తూర్పు వీధి గంగానమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో నిర్వాహకులు
ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న తూర్పు వీధి గంగానమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. జాతరలో భాగంగా మేడలపై కొలువుదీరిన శ్రీ కొర్లపాటి అంకమ్మ, శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబులను దర్శించుకొని సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి అమ్మవారికి చీరను కానుకగా సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనించాలని ఆకాంక్షించారు.